: వార్దా అంటే ఏమిటి? తుపానుకు ఈ పేరు ఎవరు పెట్టారు?


తీరం వైపు గంటకు 15 కి.మీ. వేగంతో దూసుకువస్తోన్న వార్దా తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. అసలు ఈ తుపానుకు వార్దా అనే పేరు ఎలా వచ్చిందో తెలసుకుందాం. వార్దా అంటే ఎర్ర గులాబీ అని అర్థం. ఈ తుపానుకు పేరు పెట్టింది పాకిస్థాన్. హిందూమహాసముద్రంలో ఏర్పడే తుపానులకు ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, మయన్మార్, పాకిస్థాన్, ఒమన్ దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. ఈ తుపానులకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి వాటికి పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమయింది . ఒక్కొక్క తుపానుకు వరుసక్రమంలో ఒక్కొక్క దేశం సూచించిన పేరును పెడతారు. గతంలో చెన్నైను అతలాకుతలం చేసిన తుపానుకు నాడా అనే పేరును సూచించింది ఒమన్ దేశం.

  • Loading...

More Telugu News