: కాంగ్రెస్ పార్టీ వినాశనానికి ఆయన కంకణం కట్టుకున్నారు: స్మృతి ఇరానీ

కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయడానికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీని లేకుండా చేసేందుకు ఆయన యత్నిస్తున్నారని అన్నారు. తాను మాట్లాడితే భూకంపం వస్తుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భూకంపం వచ్చేది పార్లమెంటులో కాదని... కాంగ్రెస్ పార్టీలోనే అని చెప్పారు. తన సొంత నియోజకవర్గంలోని ప్రజలకు సమాధానం చెప్పలేని రాహుల్... తన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పాక్ సైన్యంపై సర్జికల్ దాడులను నిర్వహించడం, పెద్ద నోట్లను రద్దు చేయడంలాంటి గొప్ప ఘటనలు మోదీ పాలనలో జరిగాయని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయానికి దేశం మొత్తం మద్దతు పలుకుతున్నా... కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మాత్రం వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.

More Telugu News