: అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్ సన్!
అమెరికా నూతన విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్ సన్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఎగ్జాన్ మెబిల్ సీఈవో అయిన టిల్లర్ సన్ అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం కావడం దీన్ని బలపరుస్తోంది. విదేశాంగ మంత్రిగా టిల్లర్ సన్ పేరును వచ్చే వారం ప్రకటించవచ్చని ట్రంప్ వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి జాన్ బోల్టన్ టిల్లర్ సన్ డిప్యూటీగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.