: కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కు 40 ఏళ్ల వ్యక్తి కిడ్నీ దానం


విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు మూత్ర పిండ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం సర్జరీ జరగ్గా మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఓ 40 ఏళ్ల వ్యక్తి స్వచ్చందంగా తన కిడ్నీని మంత్రి కోసం దానంగా ఇచ్చినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వ్యక్తికి మంత్రితో ఎటువంటి అనుబంధం లేదని స్పష్టం చేశారు. సర్జరీ తర్వాత మంత్రి, కిడ్నీ దాత ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగ్గానే ఉన్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా తెలిపారు. ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. కాగా, సుష్మా స్వరాజ్ ను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించేందుకు రెండు నుంచి మూడు వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News