: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ రికార్డుల వరద


ముంబైలో జరుగుతున్న ఇంగ్లండ్-భారత్ టెస్ట్ మ్యాచు డాషింగ్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ రికార్డుల వేదికగా చరిత్రలో నిలిచిపోతుంది. శనివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా సెంచరీ దాటిన కోహ్లీ అత్యధిక సెంచరీలు చేసిన భారత జట్టు కెప్టెన్లలో మూడో వాడిగా నిలిచాడు. తన కెరీల్లో మొత్తం 15 సెంచరీలు పూర్తి చేసుకోగా, కెప్టెన్ గా ఎనిమిది సెంచరీల మార్కును దాటాడు. సునీల్ గవాస్కర్ 11 సెంచరీలతో మొదటి స్థానంలో, తొమ్మిది సెంచరీలతో అజారుద్దీన్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ సిరీస్ లో కోహ్లీ 500 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 4,000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లలో సగటు బ్యాటింగ్ 50+ రికార్డు కోహ్లీ ఖాతాలో చేరిపోయింది. 2016లో కోహ్లీ నాలుగు టెస్ట్ సెంచరీలు చేశాడు. ఒక్క ఈ ఏడాదిలోనే వెయ్యి పరుగులు తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News