: సభ్యులందరూ సెలవులపై వెళ్లిపోండి.. విపక్షాల తీరుపై లోక్ సభ స్పీకర్ ఆగ్రహం


పెద్దనోట్ల రద్దుపై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు లోక్ సభలో ఈరోజు కూడా ఆందోళన చేపట్టాయి. దీంతో, సభ్యుల తీరుపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు సభను వాయిదావేస్తూ సభ్యులందరూ సెలవులపై వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ సజావుగా జరిగేలా వ్యవహరించాలని సభ్యులను కోరినప్పటికీ వారు వినకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడు రోజుల్లో ముగియనున్నాయి. వీకెండ్ తో పాటు సోమ, మంగళ వారాల్లో ఈద్-ఇ-మిలద్ పండగ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు జరగవు. తిరిగి వచ్చే బుధవారం నాడు సమావేశాలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News