: డబ్బే డబ్బు... దేశ వ్యాప్తంగా పట్టుబడుతున్న లక్షలాది రూపాయల కొత్తనోట్లు
దేశ వ్యాప్తంగా పలు చోట్ల జరుపుతున్న దాడుల్లో ఐటీ శాఖ అధికారులు, పోలీసులకి లక్షలాది రూపాయల డబ్బు పట్టుబడుతోంది. ఈ రోజు ముంబయిలోని దాదర్‌లో తనిఖీలు నిర్వహించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.85 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హర్యానాలో తనిఖీలు నిర్వహిస్తోన్న క్రైం బ్రాంచ్ పోలీసులు గురుగ్రాంలో దాదాపు 10 లక్షల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.76 లక్షల కొత్తనోట్లను తరలిస్తోన్న నలుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు బ్యాంకుల్లో డబ్బులేదని సామాన్యులకి బ్యాంకర్లు చెబుతుండగా మరోవైపు అక్రమార్కుల చేతికి భారీ మొత్తంలో డబ్బు అందుతోంది.