: విజయ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్నంత స్థాయిలో విజయ్ కి కూడా అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద భారీ హంగామానే ఉంటుంది. రజనీకాంత్ కు విజయ్ వీరాభిమాని. అంతేకాదు, రజనీ సూపర్ హిట్ మూవీ 'అన్నామలై'ని రీమేక్ చేయాలనేది విజయ్ కోరిక. తన కోరికను ఎన్నోసార్లు బహిరంగంగానే వెల్లడించాడు విజయ్. ప్రస్తుతం రజనీ నటిస్తున్న 'రోబో 2.0', విజయ్ నటిస్తున్న 'భైరవ' సినిమాలు చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం ఇన్స్ స్టిట్యూట్ ఆవరణలో జరుగుతున్నాయి. దీంతో, పక్కనే ఉన్న రజనీని కలిశాడు విజయ్. అంతేకాదు, అనుమతిస్తే 'అన్నామలై' సినిమాను రీమేక్ చేస్తానని అడిగాడు. దానికి రజనీకాంగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో, విజయ్ తర్వాతి సినిమా 'అన్నామలై'నే అని కోలీవుడ్ లో టాక్ వచ్చేసింది.