: నేను మాట్లాడితే మోదీ కాళ్ల కింద భూకంపమే: నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
లోక్ సభలో తాను మాట్లాడేందుకు యూపీఏ ప్రభుత్వం అనుమతించడం లేదని, తాను మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోదీ కాళ్ల కింద భూకంపం వస్తుందని, ఎక్కడ తమ పునాదులు కదిలిపోతాయోనన్న భయంతోనే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుపై చర్చించకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం చర్చకు దూరంగా పారిపోతోందని విమర్శించిన ఆయన, దేశ చరిత్రలో నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని, లోక్ సభలో తాను మాట్లాడతానని కోరుతుంటే, ఆ అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. దేశమంతా ప్రసంగాలు ఇస్తున్న మోదీ, నోట్ల రద్దుపై చర్చించేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. తాను లోక్ సభలోనే నిజానిజాలన్నీ తేటతెల్లం చేస్తానని రాహుల్ వెల్లడించారు.