: విజయ్ మాల్యా బ్యాంకు ఖాతాలు, పాస్ వర్డ్ లు ఆన్ లైన్లో... బ్లాక్ మెయిల్ చేస్తున్న హ్యాకర్లు!


ఇండియాలో బ్యాంకులకు కట్టాల్సిన రుణాన్ని చెల్లించకుండా విదేశాలకు పారిపోయి లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. రెండు వారాల క్రితం రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎకౌంట్ ను హ్యాక్ చేసిన వాళ్లే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఇక తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన మాట నిజమేనని మాల్యా ధ్రువీకరించారు. తన ఈ-మెయిల్ ఖాతా కూడా హ్యాక్ చేశారని, వారు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాల్యా ఆరోపించారు. తన బ్యాంకు ఎకౌంట్లు, వాటి పాస్ వర్డ్ లను పలు ట్వీట్లలో పోస్టు చేస్తున్నారని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News