: శంషాబాద్ లో నోట్ల కట్టల లారీ... ఎవరివో? ఎంతో?


భారీ ఎత్తున నోట్ల కట్టలతో నగరంలోకి ప్రవేశిస్తున్న లారీని శంషాబాద్ వద్ద ఈ ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన లారీని ఆపి డ్రైవర్ ను ప్రశ్నించగా, అతను పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అనుమానం పెరిగిన పోలీసులు లారీని సోదా చేయగా, భారీ ఎత్తున కరెన్సీ బయటపడింది. దీంతో లారీని సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్ ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదే లారీని ఫాలో అవుతూ వస్తున్న ఓ జీప్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ లారీ ఎక్కడి నుంచి వస్తోంది? దీనిలో దొరికిన డబ్బెంత? అన్న వివరాలతో పాటు, లారీని పట్టుకున్న విషయమై పోలీసులు అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది.

  • Loading...

More Telugu News