: ఢిల్లీ మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్ స్టర్‌ దొరికిపోయాడు


ఢిల్లీ మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్ స్టర్‌ మజీత్‌ సింగ్‌ మహల్‌ దొరికిపోయాడు. అతన్నుంచి 9ఎంఎం పిస్తోల్‌, 52 లైవ్‌ క్యాట్రిడ్జ్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై 24కు పైగా కేసులు ఉండడం విశేషం. బలవంతపు వసూళ్లు, హత్యలు, హత్యా యత్నాలు, ఆయుధ చోరి, దాడులు వంటి కేసుల్లో మంజీత్ సింగ్ మహల్ ప్రధాన నిందితుడు. ఢిల్లీ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న మంజీత్ సింగ్ మహల్, 2015 మార్చిలో ఢిల్లీలో మాజీ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ హత్య, అదే ఏడాది డిసెంబర్‌ లో సునీల్‌ అనే ప్రముఖ వైద్యుడి హత్య కేసుల్లో అతను ప్రధాన ముద్దాయి. కాగా, అతని తలపై 50 వేల రూపాయల రివార్డు కూడా ఉంది. తమను ముప్పుతిప్పలు పెడుతున్న మంజీత్ సింగ్ మహల్ కదలికలపై ఢిల్లీ పోలీసులు సీరియస్ గా నిఘా పెట్టారు. నజఫ్‌ గఢ్, ద్వారకా, గుర్గావ్, చత్తర్‌ ఫూర్‌ లలో అతని కదలికలపై సమాచారం అందడంతో రెండు రోజుల క్రితం రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. తన స్నేహితుడ్ని కలుసుకునేందుకు వచ్చిన మంజీత్ సింగ్ మహల్ ను నేటి ఉదయం పది గంటల సమయంలో ద్వారకా ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News