: టీజర్ లో అదరగొట్టిన చిరంజీవి...విడుదలైన 'ఖైదీ నెంబర్ 150' సినిమా టీజర్


మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150' చిత్రం టీజర్ రిలీజైంది. టీజర్ లో చిరంజీవి అభిమానులను అలరించారు. 'ఇంద్ర' సినిమాలోని ఫేమస్ డైలాగ్ ను గుర్తుచేసే విధంగా ఈ టీజర్ లో డైలాగులుండడం విశేషం. టీజర్ లో గళ్ల చొక్కా, కళ్లద్దాలతో యంగ్ లుక్ లో కనిపించిన చిరంజీవి ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌’ అంటూ చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాలో కాజల్ కధానాయకిగా నటిస్తోంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తుండగా, దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News