: ‘గెయిల్’ మాజీ చైర్మన్ కు జీవిత సాఫల్య పురస్కారం


గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) మాజీ చైర్మన్ డాక్టర్ సీఆర్ ప్రసాద్ ను పెట్రో టెక్-2016 జీవిత సాఫల్య పురస్కారం వరించింది. ఢిల్లీలో నిన్న ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. కాగా, ఇంధన రంగంలో పలు విభాగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఆయన విశిష్ట సేవలు అందించారు. 1994 నుంచి 1996 వరకు గెయిల్ లో మార్కెటింగ్ ప్రణాళిక విభాగం సంచాలకుడిగా పనిచేశారు. 1996 సెప్టెంబర్ లో గెయిల్ సీఎండీగా నియమితులయ్యారు. పదవీ విరమణ అనంతరం కూడా పలు సంస్థలకు సీఎండీగా వ్యవహరించారు.

  • Loading...

More Telugu News