: డిజిటల్ మనీ దిశగా దేశం దూసుకెళ్తోంది: అరుణ్ జైట్లీ


డిజిటల్ మనీ దిశగా దేశం దూసుకెళ్తోందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గత నెల రోజుల్లో డిజిటల్ లావాదేవీలు 20 శాతం నుంచి 40 శాతానికి పెరిగాయని అన్నారు. నగదు లావాదేవీల నిర్వహణ కష్టమని, అందుకే డిజిటల్ మోడ్ లోకి మారుతున్నామని ఆయన చెప్పారు. క్యాష్ లెస్ లావాదేవీల నిర్వహణ వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. డబ్బు స్థానంలో డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డులపై పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై 0.7 శాతం డిస్కౌంట్ లభిస్తోందని అన్నారు. రైల్వే రిజర్వేషన్ చేయించుకుంటే పది లక్షల రూపాయల విలువైన జీవిత బీమా ఉచితమని పేర్కొన్నారు. డిజిటల్ పధ్ధతిలో తీసుకునే రైల్వే పాసుల ధరలు తగ్గించామని ఆయన పేర్కొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ లపై 8 శాతం ప్రీమియం తగ్గించామని ఆయన అన్నారు. టోల్ గేట్ల దగ్గర కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా చేయడానికి కేంద్రం వద్ద ఉన్న డేటా ఏంటని మీడియా ప్రశ్నించడంతో... ఇప్పుడే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని, డేటాలు అడగవద్దని ఆయన చెప్పారు. పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు స్వైపింగ్ మెషీన్లు అందజేస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ మోడ్ లో 2000 రూపాయలలోపు వినియోగంపై ఎలాంటి చార్జీలు ఉండవని ఆయన చెప్పారు. 2000 దాటితేనే అదనపు ఛార్జీలు పడతాయని ఆయన తెలిపారు. డీమానిటైజేషన్ వల్ల ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనాలు చెప్పలేమని ఆయన అన్నారు. అయితే భవిష్యత్ లో కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News