: టీటీడీ బోర్డ్ మెంబర్ ఇంట్లో 90 కోట్ల కొత్త నోట్లు, 100 కేజీల బంగారం
టీటీడీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి నివ్వెరపోయింది. దేశ వ్యాప్తంగా డబ్బులు లేక బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా ప్రజలు తిరుగుతుండగా, శేఖర్ రెడ్డి ఇంట్లో 90 కోట్ల రూపాయలు లభ్యం కాగా, ఇందులో ఏకంగా 70 కోట్ల రూపాయలు కొత్త నోట్లు కావడం విశేషం. వీటితో పాటు సుమారు 100 కేజీల బంగారం కూడా ఆయన నివాసంలో దొరకడం పెనుకలకలం రేపుతోంది. దీంతో శేఖర్ రెడ్డి సన్నిహితులు ప్రేమ్, శ్రీనివాసరెడ్డి నివాసాల్లో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.