: స్క్రిప్ట్ డిమాండ్ చేయకపోతే సిక్స్ ప్యాక్ చేసేవాడ్ని కాదు: రామ్ చరణ్


డిమాండ్ లేకపోతే సిక్స్ ప్యాక్ చేసేవాడ్ని కాదని సినీ హీరో రామ్ చరణ్ తెలిపాడు. 'ధృవ' సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డి కోరడంతో సిక్స్ ప్యాక్ చేశానని చెప్పాడు. సిక్స్ ప్యాక్ చేయాలని మామూలుగా ఎవరూ అనుకోరని చరణ్ తెలిపాడు. అంతా బాగున్నప్పుడు ఊరికే ఎందుకు కష్టపడాలని అంతా అనుకుంటారని, తాను కూడా అంతేనని, అయితే సిక్స్ ప్యాక్ చేయమనడంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు. అరవింద స్వామి అద్భుతంగా నటించారని అన్నాడు. తాను ఇంత వరకు చేసిన సినిమాల్లో బాగా కష్టపడింది ఈ సినిమాకేనని చెప్పాడు. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు యాక్షన్ సినిమా అనే ఫీల్ ఉంటుందని రామ్ చరణ్ తెలిపాడు. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News