: ఆరు తరాల ముచ్చట.. మనవరాలి ముని మనవరాలిని లాలించిన బామ్మ!

తల్లిదండ్రులు తమ మనవలను చూడడం మామూలే. మనవరాలి కుమార్తెను (ముని మనవరాలు) చూడాలనుకోవడం అత్యాశే... అయినా అప్పుడప్పుడు కొందరు చూస్తూనే వుంటారు. అలాంటిది మనవరాలి మనవరాలిని చూడడం ఇంచుమించు అసాధ్యమే. కానీ కెనడాకు చెందిన వెరా సోమర్ ఫెల్డ్ (96) మాత్రం తన మనవరాలి మనవరాలి కుమార్తెను (ముని మనవరాలు) ఒళ్లోకి తీసుకుని మురిసిపోయింది. కెనడాలోని అల్బెర్టాలోని లెత్ బ్రిడ్జి అనే గ్రామంలో వెరా, అమె కుమార్తె, మనవరాలు, ముని మనవరాలు నివాసం ఉంటారు. ముని మనవరాలి కుమార్తె, ఆమె కుమార్తె మరో చోట నివాసం ఉంటారు. అయితే నెలలో ఒకరోజు కుటుంబంలోని ఆరు తరాలవారు ఒకచోట కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. 96 ఏళ్ల వెరా తన తరువాతి ఐదో తరానికి చెందిన క్యాలీని గత అక్టోబర్ లో ఎత్తుకుని అద్భుతమైన, అరుదైన ఆ క్షణాలను ఆస్వాదించారు. వారి వయసు వివరాల్లోకి వెళ్తే... చిన్నారి క్యాలీ (2 నెలలు) తల్లి అలీసా (20), ఆమె తల్లి అమందా (39), ఆమె తల్లి గ్రేస్‌ (59), ఆమె తల్లి గ్వెన్‌ (75) ఆమె తల్లి వెరా (96).

More Telugu News