: అమెరికాలో గిన్నిస్ రికార్డు స్థాపించిన భారత ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయి బర్త్ డే కేక్


ఒక బర్త్ డే కేక్ మీద అత్యధిక క్యాండిల్స్ వెలిగించిన సరికొత్త రికార్డు అమెరికాలో భారత ఆధ్యాత్మిక గురువు శ్రీ చిన్మయి 85వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నమోదైంది. 1964 ప్రాంతంలో న్యూయార్క్ నగరానికి వచ్చిన చిన్నయీ కుమార్ ఘోష్, ధ్యానం చేయడం ఎలానో నేర్పుతూ క్రమంగా గురువుగా మారారు. ఆయన పుట్టిన రోజు వేడుకల వేళ, బర్త్ డే కేక్ పై మొత్తం 72,585 క్యాండిల్స్ వెలిగించారు. గతంలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ వేడుకలో బర్త్ డే కేక్ పై 50, 151 క్యాండిల్స్ వెలిగించిన రికార్డుండగా, చిన్మయీ కేక్ పై క్యాండిల్స్ సంఖ్య దాన్ని అధిగమించింది. మొత్తం 100 మంది ఈ కేక్ ను తయారు చేయగా, దీనిపై ఉంచిన క్యాండిల్స్ ను వెలిగించేందుకు 60 బ్లో టార్చ్ లను వినియోగించారు. అన్నింటినీ వెలిగించిన తరువాత పాత రికార్డు బద్దలైందని ఖరారు చేసేందుకు వాటిని 40 సెకన్ల పాటు వెలగనిచ్చి ఆపై చిన్మయీ భక్తులు ఆర్పివేశారు. రెండు అడుగుల వెడల్పుతో 80.5 అడుగుల పొడవైన ఈ కేక్ చుట్టూ చిన్మీ అనుచరులు చేరి సంప్రదాయ పద్ధతిలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కాగా, నిన్నటి వరకూ బర్డ్ డే కేక్ పై అత్యధిక క్యాండిల్స్ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన మైక్ హార్డ్ లెమోనాడే పేరిట ఉండగా, ఇప్పుడది బద్దలైంది.

  • Loading...

More Telugu News