: అండమాన్ దీవుల్లో చిక్కుకున్న 800 మంది పర్యాటకులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాల ధాటికి అండమాన్ దీవుల్లో 800 మంది పర్యాటకులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అక్కడి స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది. మరోవైపు నేవీ సాయం కూడా కోరింది. వెంటనే స్పందించిన నావికాదళం 3 ఓడలను పంపింది. పోర్ట్ బ్లెయిర్ నుంచి బయలుదేరిన ఈ ఓడలు మరికాసేపట్లో అక్కడకు చేరుకోనున్నాయి. అండమాన్ దీవుల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాయుగుండం ప్రభావం తెలుగురాష్ట్రాలపై కూడా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.