: తనపై వస్తున్న రూమర్లపై ఫైర్ అయిన విద్యాబాలన్
భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో తనకు విభేదాలు తలెత్తాయంటూ వస్తున్న రూమర్లపై బాలీవుడ్ నటి విద్యాబాలన్ స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ ఆమె కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని చెప్పింది. గతంలో కూడా తన ప్రెగ్నెన్సీపై పలు కథనాలు వెలువడ్డాయని... తనను ప్రతినెలా గర్భవతిని చేశారని మండిపడింది. మొదట్లో ఇలాంటి రూమర్ల పట్ల కొంచెం బాధ పడేదాన్నని... ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని విద్య చెప్పింది. సినీ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను నాలుగేళ్ల క్రితం ఆమె పెళ్లాడింది.