: చెన్నైకు వీవీఐపీల తాకిడి.. షెడ్యూల్డ్ విమానాలు దిగేందుకు లభించని అనుమతి!
ఈ రోజు జరిగిన జయలలిత అంత్యక్రియలకు పలువురు వీవీఐపీలు హాజరవడంతో చెన్నైలో ఎయిర్ ట్రాఫిక్ రద్దీగా ఉంది. దీంతో, షెడ్యూల్డ్ ఫ్లైట్స్ దిగేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి పైలట్లకు అనుమతులు లభించలేదు. ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటల నుంచి 1.30 గంటల వరకు చార్టెడ్, షెడ్యూల్డ్ ఫ్లైట్స్ లో వీవీఐపీలు చెన్నై చేరుకున్నారు. దీంతో, రెండు ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్స్ తో పాటు శ్రీలంక ఎయిర్ లైన్స్ కు చెందిన జెట్ లు ఇక్కడి ఎయిర్ పోర్టులో దిగేందుకు ఏటీసీ అధికారులు అనుమతించలేదు. కొంచెం సేపు ఎయిర్ పోర్ట్ గగనతలంలోనే చక్కర్లు కొట్టాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయా విమానాల పైలట్ లు స్పందిస్తూ వేరే ఎయిర్ పోర్టులలో దింపేందుకు అనుమతించాలని, ఇంధనం తక్కువగా ఉందని అధికారులకు చెప్పారు.