: జయలలిత అంతిమయాత్రకు రెండు టన్నుల పూలు వాడారు!


జయలలిత అంతిమయాత్ర నిమిత్తం రెండు టన్నుల పూలను వినియోగించారు. ఆమెను తీసుకువెళ్లిన వాహనాన్ని, సైనికులు ఉన్న గన్ క్యారేజ్ వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించేందుకు నలభై మంది పదిగంటలపాటు కష్టపడ్డారట. పలు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన 2 టన్నుల పూలను ఊరేగింపుకు, అంత్యక్రియల నిమిత్తం వినియోగించారని సమాచారం. రెండు రకాల పూలను వినియోగించారు. ముఖ్యంగా అలంకరణ నిమిత్తం జెబ్రా ప్లాంట్, సువాసన గల పుష్పాలను వినియోగించారు. వీటితో పాటు సాంప్రదాయకంగా ఉపయోగించే గులాబీలు, తెల్లబంతి పువ్వులను వాడినట్లు కోయంబేడ్ మార్కెట్ కు చెందిన సీనియర్ ఫ్లోరిస్ట్ వేలు పేర్కొన్నారు. ఆర్మీ వాహనాన్ని, గన్ క్యారేజ్ ను అలంకరించేందుకు, ఖననం చేసే చోట వినియోగించే నిమిత్తం మొత్తం 2,000 కిలోల పూలను వాడినట్లు చెప్పారు. కట్ ఫ్లవర్స్, తెల్ల బంతిపూలను బెంగళూరు నగరం సహా పలు ప్రాంతాల నుంచి తెప్పించామన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి నలభై మంది పనివారు పూలదండలు తయారు చేశారని వేలు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News