: తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యపై చెప్పులు విసిరిన మహిళలు
తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన ఆయనపై మహిళలు చెప్పులు విసిరారు. ఈ ఘటన జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లో ఈ రోజు చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్ పూర్, జాఫర్ గఢ్, చిల్పూర్ మండలాలను జనగామ జిల్లాలో కలపొద్దంటూ తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా... జనగామ జిల్లాలో కలిపేందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారంటూ ఇప్పటికే రాజయ్యపై ఈ ప్రాంతవాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అక్కడకు వచ్చిన రాజయ్యపై వారు కోపంతో ఊగిపోయారు. రాజయ్య వాహనంపైకి మహిళలు చెప్పులు విసిరారు. దీంతో రాజయ్య అతని అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.