: రాజాజీ హాల్ ను వీడిన జయలలిత పార్థివ దేహం
నేటి ఉదయం నుంచి లక్షలాది మంది ప్రజలను, వారి అభిమానాన్ని, కన్నీటిని చూసిన రాజాజీ హాల్ ఒక్కసారిగా మూగబోయింది. రాజాజీ హాల్ నుంచి సైనిక లాంఛనాలతో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని తీసుకుని త్రివిధ దళాధికారులు సైనిక లాంఛనాలతో మెరీనా బీచ్ దిశగా కదిలారు. ఆమెను అంత్యక్రియలకు తీసుకెళ్తున్న రహదారి మొత్తాన్ని సీఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు పూర్తిగా అధీనంలోకి తీసుకున్నారు. రహదారికిరువైపులా జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్దఎత్తున చేరి, కడసారి చూపుకోసం నిరీక్షించారు. లక్షలాదిగా అభిమానగణం వెంటరాగా, జయలలిత అంతిమయాత్ర రాజాజీ హాల్ ను వీడి, మెరీనా బీచ్ దిశగా కదిలింది.