: ఆ అవకాశం మాత్రం ధోనీకే: మనసులోని అభిప్రాయం చెప్పిన సచిన్


బారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఎప్పుడు ఆటకు విరామం పలకాలన్న విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం, అవకాశం అతనికే ఇవ్వాలని లెజండరీ క్రికెటర్, భారతరత్న సచిన్ తెండూల్కర్ అభిప్రాయపడ్డారు. తాను ఎన్నడు రిటైర్ మెంట్ ప్రకటించాలన్న విషయమై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుందనే తాను భావిస్తున్నట్టు తెలిపారు. నేడో రేపో విరాట్ కోహ్లీకి వన్డే జట్టు పగ్గాలు సైతం అప్పగించాలన్న వాదన పెరుగుతున్న నేపథ్యంలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ధోనీకి అద్భుతమైన ఫిట్ నెస్ ఉందని, ప్రతి క్రికెటర్ జీవితంలో ఫామ్ కోల్పోయి ప్రజలు, అభిమానులతో మాటలు పడే రోజులు ఎదురవుతాయని, ఆ సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని సచిన్ అన్నారు. ధోనీ వయసుకు, అతని ఆటతీరుకూ ముడిపెట్టడం తగదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News