: ‘అమ్మ’ చేతుల మీదుగా అవార్డు అందుకున్నా: ట్విట్టర్ లో రాంగోపాల్ వ‌ర్మ‌


న‌టులు విక్ట‌రీ వెంక‌టేశ్‌, శ్రీ‌దేవీ జంట‌గా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ 1991లో ‘క్షణక్షణం’ సినిమాను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. అద్భుత విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి గానూ ఆ సమయంలో రాంగోపాల్‌ వ‌ర్మ‌కి ఉత్తమ దర్శకుడి అవార్డు వ‌చ్చింది. ఆ అవార్డును దివంగ‌త నేత‌ జయలలిత చేతుల మీదుగా ఆయ‌న అందుకొన్నారు. తాను అమ్మ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాన‌ని వ‌ర్మ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను ఆయ‌న త‌న‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

  • Loading...

More Telugu News