: 11:30కి ప్రధాని చెన్నై రాక... 12 గంటలకు చంద్రబాబు
నిన్న రాత్రి కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైకి రానున్నారు. 9:30 గంటలకు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరే మోదీ, ఉదయం 11:30 గంటలకు చెన్నై చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రాజాజీ హాల్ కు వెళ్లే ఆయన, జయలలితకు నివాళులు అర్పించి అక్కడే కాసేపు గడపనున్నారు. సాయంత్రం అంత్యక్రియలు జరిగేంతవరకూ మోదీ చెన్నైలోనే ఉంటారని సమాచారం. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఉదయం 12 గంటల సమయానికి చెన్నై చేరుకుని, అంత్యక్రియలు ముగిసే వరకూ అక్కడే ఉంటారని అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులై సైతం చెన్నై రానున్నట్టు తెలుస్తోంది.