: తమిళనాట పరిస్థితులపై ప్రధానికి ఎప్పటికప్పుడు సమాచారం..అప్ డేట్ చేస్తున్న వెంకయ్యనాయుడు
‘అమ్మ’ జయలలిత ఆరోగ్యం, తమిళనాట పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలియజేస్తున్నట్లు సమాచారం. సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకు ఈరోజు సాయంత్రం ఆయన చెన్నైకు వెళ్లారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వెంకయ్యనాయుడు, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు వైద్య నిపుణులతో మాట్లాడారు. అనంతరం, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎస్ లతో వాస్తవ పరిస్థితులను సమీక్షించారు. కాగా, ఈరోజు రాత్రికి చెన్నైలోనే వెంకయ్యనాయుడు బస చేయనున్నారు.