: జయలలిత నాకు చెల్లెలు లాంటిది..త్వరగా కోలుకోవాలి: వైగో
జయలలిత తనకు చెల్లెలుతో సమానమని, ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎండీఎంకే అధినేత వైగో అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జయలలితకు అధునాతన వైద్య చికిత్సను అందిస్తున్నారని, ఆమె కోలుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జయలలిత కోలుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు, తమిళనాడులోని రాజకీయపార్టీల నేతలు సామాజిక మాధ్యమాల ద్వారా పలు ట్వీట్లు చేస్తున్నారు.