: నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు


నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఐదువేల రూపాయలకు మించిన బిల్లులన్నింటికీ ఈ పేమెంట్ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేసి, ఈ-పేమెంట్స్ ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. కాగా, గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ.10 వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ.5 వేలకు కుదించడం గమనార్హం.

  • Loading...

More Telugu News