: జయలలిత వారసుడిగా పన్నీరు సెల్వం పేరు ఖరారు!
తమిళనాడులో తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జయలలిత వారసుడిని ఎంపిక చేయడం ద్వారా పార్టీలో ఎలాంటి అనిశ్చితి తలెత్తకుండా ఉండేందుకు కసరత్తు జరుగుతోంది. ఎమ్మెల్యేల నుంచి డిక్లరేషన్ ఇవ్వాల్సిందిగా పార్టీ కోరిందని, జయ విధేయుడు, అన్నాడీఎంకే సీనియర్ నేతల్లో ఒకరైన పన్నీరు సెల్వంకే పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేశారు. ఈమేరకు సాయంత్రంలోగా అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, తమిళనాడులో కీలక మంత్రిత్వ శాఖలన్నింటినీ పన్నీర్ సెల్వంకు ఇటీవలే అప్పగించారు. గతంలో రెండుసార్లు తాత్కాలిక సీఎంగా పన్నీరు సెల్వం వ్యవహరించారు.