: జయలలిత ఆరోగ్యంపై ఇక స్పష్టమైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని తమిళనాడు ఎమ్మెల్యేల తీర్మానం


చెన్న‌య్ అపోలో ఆసుప‌త్రిలో జ‌య‌ల‌లిత మృత్యువుతో పోరాడుతున్న నేప‌థ్యంలో అదే ఆసుప‌త్రిలోని రెండో అంత‌స్తులో ఈ రోజు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స‌మావేశం నిర్వ‌హించారు. అందులో జయలలిత ఆరోగ్యంపై ఆసుప‌త్రి వైద్యుల‌తో స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌క‌ట‌న చేయించాల‌ని తీర్మానించారు. నిన్న‌టి వ‌ర‌కు చోటుచేసుకున్న అన్ని ప‌రిణామాల‌పై వివ‌రించాల‌ని ఎమ్మెల్యేలు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే, స్ప‌ష్ట‌మైన‌ ప్ర‌క‌ట‌న చేసేముందు ఎమ్మెల్యేల‌ ముందు ఆ ఆసుప‌త్రి వైద్యులు కొన్ని ష‌ర‌తులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆసుప‌త్రి వైద్యులు ఎమ్మెల్యేల సంతకాలు కూడా తీసుకున్నట్లు స‌మాచారం. స‌మావేశంలో భాగంగా త‌దుప‌రి నాయ‌క‌త్వంపై కూడా ఆ రాష్ట్ర‌ ఎమ్మెల్యేలు చ‌ర్చించారు. ఈ రోజు సాయంత్రం ఆసుప‌త్రి నుంచి మ‌రో ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News