: జయలలిత ఆరోగ్యంపై ఆరాతీసిన చంద్ర‌బాబు, కేసీఆర్


చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు అత్య‌వ‌స‌ర చికిత్స కొన‌సాగుతోంది. ఆమెకు నిన్న సాయంత్రం గుండెపోటు రావ‌డంతో ఆమె అభిమానులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెలుసుకున్నారు. జయలలిత ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీసి, ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ‘పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News