: చెన్నైకి నలుగురు సభ్యుల వైద్య బృందాన్ని పంపాం: జేపీ నడ్డా


సెప్టెంబరు 22 నుంచి తమిళనాడులోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జయలలితకు నిన్న సాయంత్రం గుండెపోటు వ‌చ్చిన అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ న‌డ్డా స్పందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. చెన్నైకి నలుగురు సభ్యుల వైద్య బృందాన్ని పంపామని చెప్పారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న దృష్ట్యా తాము ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొన్నారు. జయలలిత త్వరగా కోలుకుంటార‌ని తాము ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న స్పందిస్తూ ఎయిమ్స్ వైద్యులు వైద్యులు ఈ రోజు చెన్నై అపోలో ఆసుప‌త్రికి చేరుకుంటార‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News