: ట్యాంక్ బండ్ పై 'సెల్ఫీ స్పాట్‌' వద్ద గవర్నర్ దంపతుల సందడి... భార్యను 'రండి మేడమ్' అని ఆహ్వానించిన నరసింహన్


హైదరాబాద్ నగరంలోని ట్యాంక్‌ బండ్‌ పై ఉన్న 'లవ్‌ హైదరాబాద్‌ సెల్ఫీ స్పాట్‌' వద్ద తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఆయన సతీమణి విమలా నరసింహన్ లు నిన్న సాయంకాలం సందడి చేశారు. ఇక్కడికి వచ్చిన గవర్నర్‌ సందర్శకులతో కాసేపు సరదాగా గడిపారు. లవ్‌ హైదరాబాద్‌ స్పాట్‌ కు గవర్నర్‌ దంపతులు రెండు వేర్వేరు వాహనాల్లో రాగా, తొలుత వచ్చిన నరసింహన్, తన సతీమణి రాకకోసం కాసేపు వేచి చూశారు. ఆపై మరో కారులో వచ్చి దిగిన భార్య విమలను చూసి "ఇలా రండి మేడమ్‌" అంటూ స్వాగతం పలికారు. ఆపై గవర్నర్ దంపతులు సంజీవయ్య పార్కు లోనికి వెళ్లి, అక్కడే ఆడుకుంటున్న పిల్లలతో కాసేపు గడిపి, అరగంటకు పైగా వాకింగ్‌ చేశారు. పార్కు నిర్వహణను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News