: పోలీసుల దిగ్బంధంలో తమిళనాడు.. ఎక్కడికక్కడ మోహరింపు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. టోల్‌ప్లాజాలు, జాతీయ రహదారిపై బలగాలను భారీగా మోహరించారు. పోలీసుల సెలవులను రద్దు చేసిన ఉన్నతాధికారులు అత్యవసరంగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటూ తమిళనాడులో ప్రస్తుతం హై అలెర్ట్ ఉంది. మరోవైపు ఒక్క అపోలో అస్పత్రి వద్దే దాదాపు మూడువేల మంది పోలీసులను మోహరించారు. ఆస్పత్రికి దారితీసే అన్ని మార్గాలను మూసివేశారు. ఇప్పటికే 9 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. కేంద్రం నుంచి మరో 17 బలగాల పారామిలటరీ బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చాక జయలలిత ఆరోగ్యంపై ఏదో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News