: విజయశాంతి నా అభిమాన నటి: సినీ నటుడు సుమన్


విజయశాంతి తన అభిమాన నటి అని, సినిమాల్లో తమ మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విజయశాంతి, భానుప్రియతో కలిసి తాను ఎక్కువ చిత్రాల్లో నటించానని అన్నారు. తన కెరీర్, విజయశాంతి కెరీర్ సినిమాల్లో ఒకేసారి మొదలైందని, ‘నేటిభారతం’ చిత్రంతో ఒక స్టార్ డమ్ సంపాదించుకున్నామని చెప్పారు. సినిమాల్లో తమ జంట హిట్ అవడానికి ప్రధాన కారణం తమ పర్ఫామెన్సే నని అన్నారు. తాను నటించిన అన్ని చిత్రాల్లోకి ‘అన్నమయ్య’లో ఏడుకొండలవాడి పాత్ర మరవలేనిదని, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందని, తన కుటుంబసభ్యులు కూడా బాగా ఇష్టపడతారని చెప్పారు. ఆ సినిమాలో కొన్ని సీన్లు చూస్తుంటే తెలియకుండానే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని సుమన్ అన్నారు.

  • Loading...

More Telugu News