: వైఎస్ జగన్ ని కలిసిన కాసు మహేశ్ రెడ్డి.. త్వరలో పార్టీలో చేరిక


మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు మహేశ్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నారంటూ కొద్ది కాలంగా వస్తున్న వార్తలకు తెరపడింది. వైఎస్సార్సీపీలో ఆయన చేరడం ఖరారైంది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆయన కలిశారు. పార్టీలో చేరిక, పలు విషయాలపై జగన్ తో చర్చించారు. ఈ నెల 16న నరసరావుపేటలో జరగనున్న బహిరంగసభలో జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీ కండువాను ఆయన కప్పుకోనున్నారు.

  • Loading...

More Telugu News