: తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ కుట్రలు పన్నారు!: ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరామ్ పై ఎంపీ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరామ్ కుట్రలు పన్నారని, ఉద్యమాన్ని హింసవైపు మళ్లించేందుకు ప్రయత్నించారని, వాటన్నింటినీ తాము భరించామని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో కోదండరామ్ కీలుబొమ్మగా మారారని, వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ ను బతికించే ప్రయత్నం చేస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు.