: మీ అమ్మ నగలకు లెక్క చెప్పగలరా?: మోదీకి రోజా సూటి ప్రశ్న


భారత ప్రధాని నరేంద్ర మోదీ, తన తల్లి వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పగలరా? అని రోజా ప్రశ్నించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె, మీడియాతో మాట్లాడారు. "బంగారం అంటే లక్ష్మీదేవి. ప్రజల వద్ద ఉన్న వారసత్వ బంగారానికీ లెక్కలు అడుగుతున్నారు. నేను మోదీ గారిని ఒకటే అడుగుతాను. మీ తల్లిగారి దగ్గరున్న నగలకు మీరు రసీదులు ఇవ్వగలరా? మరి అనాదిగా వస్తున్న నగలన్నింటికీ కూడా ఇప్పుడు మీరు బిల్లులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా మీకు దొంగ బంగారాన్ని అరికట్టాలని వుంటే, మీకు ధైర్యముంటే, ఫస్టు అంబానీ ఫ్యామిలీ నుంచి, అదానీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయండి" అని నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News