: సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ తెల్లవారుజామున రైలు అనంతపురంలోని గార్లదిన్నె వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి రెండు గంటల సమయంలో రైలుపై రాళ్ల దాడి చేసిన దుండగులు అనంతరం రైల్లోకి చొరబడి ప్రయాణికులను కత్తులతో బెదిరించారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, 30 తులాల వరకు బంగారం దోచుకున్నారు. దుండగులు రాళ్లు విసరడంతో బెంబేలెత్తిన ప్రయాణికులు కేకలు వేశారు. వారి అరుపులతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు దుండగులపై కాల్పులు ప్రారంభించారు. అయితే వారు వచ్చే లోపే దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు.