: గాలి, దత్తాత్రేయ, యరపతినేని... కూతుళ్ల పెళ్లిళ్లకు డబ్బెక్కడిది?: రోజా సూటి ప్రశ్న
దేశమంతటా చిల్లర పైసలు దొరక్క, చేతిలో డబ్బులేక ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉంటే గాలి జనార్దన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, యరపతినేని శ్రీనివాసరావులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుమార్తెల వివాహాలు చేశారని, అంత గ్రాండ్ గా పెళ్లిళ్లు జరిపించడానికి డబ్బెక్కడిదని వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె, అంబానీ, అదానీ, వెంకయ్యనాయుడు ఇళ్లపై ఐటీ దాడులు చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, వివాహాలకు ఇంత భారీ మొత్తంలో డబ్బెలా వచ్చిందని అడిగారు. ఈ పెళ్లిళ్లకు పెట్టిన ఖర్చులపై విచారణకు రోజా డిమాండ్ చేశారు.