: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలూ లేవు: ఢిల్లీలో సీఎం చంద్ర‌బాబు


తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌మ‌కు ఎలాంటి విభేదాలూ లేవని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంతో క‌లిసిమెల‌సి ప‌నిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ నాయ‌క‌త్వ స‌ద‌స్సులో పాల్గొన్న చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ... ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. ఏపీలో 24 గంట‌ల పాటు విద్యుత్ అందిస్తున్నామ‌ని అన్నారు. భ‌విష్య‌త్తులోనూ రాష్ట్రానికి విద్యుత్ స‌మ‌స్య‌వ‌చ్చే అవ‌కాశ‌మే లేదని చెప్పారు. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌న్నీ తొల‌గి వారు సంతోషంగా ఉండాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఏపీలో అభివృద్ధికి కావ‌ల‌సిన అన్ని వ‌న‌రులు, అవ‌కాశాలు ఉన్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News