: 5 రూపాయల చెక్కు ఆయన ఎందుకిచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
‘పెద్దనోట్ల’ రద్దుతో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. వంద రూపాయల కంటే తక్కువ నోట్లే ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. బ్యాంకులకు వెళ్తే 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. దానికి చిల్లర తెచ్చుకోవడం మరోపెద్ద సాహసంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల చిల్లర సమస్యల తీవ్రత తెలిపే ఘటన మధురైలో చోటుచేసుకుంది. మధురైలో ఓ వ్యక్తి చేతిలో చిల్లరలేదు. అలాంటి సమయంలో టాయిలెట్స్ కి వెళ్లవలసి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి దగ్గర్లోని సులభ్ కాంప్లెక్స్ లో టాయిలెట్ వినియోగించుకున్నాడు. అనంతరం బయటకు వచ్చిన వ్యక్తిని ఆ సులాభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు డబ్బులడిగాడు. దీంతో తన దగ్గర డబ్బులు లేవని చెబుతూ 5 రూపాయలకు చెక్కురాసిచ్చాడు. దీంతో బిత్తరపోవడం అతని వంతైంది.