: ఎట్టకేలకు తన నివాసానికి వెళ్లిన మమతా బెనర్జీ


పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఆర్మీని మోహరించడంపై నిరసన వ్యక్తం చేస్తూ 36 గంటలపాటు సచివాలయంలోని తన కార్యాలయంలోనే నిరసన వ్యక్తం చేస్తూ సీఎం మమతా బెనర్జీ ఉండిపోవడం తెలిసిందే. దీంతో, వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం ఆర్మీని వెనక్కి రప్పించడంతో శాంతించిన ఆమె తన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ, ఆర్మీ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, రాజకీయ కక్ష సాధింపులకు సైన్యాన్ని వాడుకోవడం సరికాదని అన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న, తమను అణచివేసేందుకు చూస్తున్న మోదీ సర్కారుపై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News