: ‘ఖైదీ నంబర్ 150’లో ‘మెగా’ స్టిల్ ఇదీ!
మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ టీజర్ ను త్వరలో విడుదల చేస్తున్నట్లు ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ పేర్కొన్నాడు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చిందని చెప్పిన రామ్ చరణ్,‘ఖైదీ నంబర్ 150’ స్టిల్స్ ను పోస్ట్ చేశాడు. కాగా, వివి నాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తోంది.