: యువరాజ్ ను పెళ్లి చేసుకునేందుకు పేరు మార్చుకున్న హాజెల్ కీచ్
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి, మోడల్ హాజెల్ కీచ్ ల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలిన వీరిద్దరూ చివరకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే, యువీని పెళ్లి చేసుకోవడానికి హాజెల్ తన పేరును మార్చుకుందట. బ్రిటీష్ వనిత అయిన హాజెల్ వివాహానికి ముందు గురుద్వారాలో తన పేరును గుర్ బసంత్ కౌర్ గా మార్చుకుంది. ఈమె కొత్త పేరును గురుద్వారాలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం వీరి వివాహం ఘనంగా జరిగింది. హిందీ సినిమా 'బాడీగార్డ్'లో హాజెల్ కీచ్ నటించింది. తెలుగు సినిమా 'కృష్ణం వందే జగద్గురుం'లో ఓ ఐటెం సాంగ్ చేసింది.