: సన్నీలియోన్ కోసం నెట్లో తెగ వెతుకుతున్న ఇండియన్స్


బాలీవుడ్ నటి, మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ కు మన దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదనే విషయం మరోసారి రుజువైంది. మన దేశంలో ఇంటర్నెట్ లో అందరికంటే ఎక్కువగా సన్నీలియోన్ నే వెదికారట. మోస్ట్ సర్చ్ డ్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియాగా వరుసగా ఐదో ఏడాది సన్నీలియోన్ నిలిచింది. ప్రధాని మోదీ, కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వీరెవరూ సన్నీలియోన్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. మహిళల జాబితాలో సన్నీలియోన్ తర్వాత బిపాసాబసు, దీపికా పదుకునే, కత్రినా కైఫ్ ఉన్నారు. మేల్ సెలబ్రిటీ లిస్ట్ లో సల్మాన్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. అతని తర్వాత కపిల్ శర్మ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నారు.

  • Loading...

More Telugu News