: డబ్బుల కోసం రోడ్డుపై ఆందోళనకు దిగిన ప్రజలు... కిలో మీటరు మేర ట్రాఫిక్ జాం


పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకొని 25 రోజులు గ‌డిచిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు న‌గ‌దు అంద‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో సామాన్యులు స‌హ‌నం కోల్పోతున్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో న‌గదు కోసం ప్రజలు రోడ్డెక్కారు. ఆ ప్రాంతంలోని ఎస్‌బీఐ శాఖ‌లో త‌మ‌కు న‌గ‌దు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌జలంతా క‌లిసి కర్నూలు-గుంటూరు రహదారిపై ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌తో ఆ ప్రాంతంలో కిలోమీటరు మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. నిత్యావ‌స‌ర స‌రుకులు కూడా కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ‌ని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News